అణు బాంబులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు. వీటిని ప్రయోగించడం వల్ల కొన్ని తరాలు నష్టపోతాాయి.

అమెరికన్ శాస్త్రవేత్తల సమాఖ్య (ASF) లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం అణ్వాయుధాల సంఖ్య 12,700.

మొత్తం అణు బాంబుల్లో 90% శాతం ఆయుధాలు- రష్యా, అమెరికా కలిగి ఉన్నాయి.

5,977 అణ్వాయుధాలతో రష్యా మొదటి స్థానంలో ఉంది. అందులో 1,458 యాక్టివ్ 3, 039 ఇనాక్టివ్ ఆయుధాల ఉన్నాయి

దాదాపు ప్రపంచ అణ్వాయుధాల్లో సగం ఆయుధాలు తన ఖాతాలో ఉంచుకుంది అమెరికా. 5,428 అణ్వాయుధాలతో రెండో స్థానంలో ఉంది.

2035లోపు 1,500 అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి అనుకుంటున్న చైనా ప్రస్తుతానికి 350 అణు బాంబులను కలిగి ఉంది

290 అణు బాంబులతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది .

225 అణ్వాయుధాలతో యు.కె ఐదవ స్థానంలో ఉంది.

అమెరికన్ శాస్త్రవేత్తల సమాఖ్య (ASF) ప్రకారం భారత్ 160 అణ్వాయుధాలు కలిగి ఉంది.

165 అణ్వాయుధాలు ఉన్న పాకిస్తాన్ తో పోలిస్తే భాారత్‌్ వెనకబడి ఉంది.