రాజ్యాంగంలోని మొదటి భాగంలో హరప్పా, మొహంజదారో నాగరికతను సూచించే ఎద్దు బొమ్మను ముద్రించారు.

సిటిజన్ షిప్ సెక్షన్‌లో వైదిక నాగరికతను సూచించే చిత్రాలు గీశారు. వేదకాలం నాటి జీవనశైలిని కళ్లకు కట్టారు.

ప్రాథమిక హక్కులను ప్రస్తావిస్తూ సీతాసమేత రామ లక్ష్మణుల చిత్రాలు గీశారు. రామ జన్మభూమి వివాదాన్ని ఇది సూచిస్తుంది.

సామాజిక, ఆర్థిక పురోగతికి అవసరమైన స్టేట్ పాలసీని సూచించేందుకు భగవద్గీతలోని కృష్ణార్జునుల చిత్రాలను గీశారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లోని వ్యక్తుల బాధ్యతలకు సూచనగా బుద్ధుడి జ్ఞానోదయం చిత్రాన్ని రూపొందించారు.

గుప్తుల కాలం భారత్‌కు స్వర్ణయుగం. అందుకే ఆ కాలాన్ని సూచించే నలంద విశ్వవిద్యాలయ చిత్రాన్నీ ఇందులో చూడొచ్చు.

మొఘలుల పాలనలో సిక్కులతో భారత్‌లో అంతర్గత వాణిజ్యం మొదలైంది. దీన్ని సూచించే చిత్రాలూ ఉన్నాయి.

స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన గాంధీజీ దండి మార్చ్‌ చిత్రాలూ ఉన్నాయి. (Images Credits: theheritagelab)