నవనీతకృష్ణునిగా ఒంటిమిట్ట కోదండరాముడు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులను కరుణించనున్నారు నవనీతకృష్ణునిగా శ్రీకోదండరాముడు నవనీతకృష్ణునిగా శ్రీకోదండరాముడు