ఏప్రిల్ 13 బుధవారం రాశిఫలాలు



మేషం
మీరు ఒకేసారి చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్యూ పిలుపు వస్తుంది. షేర్ మార్కెట్, కమిషన్ వ్యాపారం చేసేవారికి లాభం వస్తుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.



వృషభం
ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు మీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటారు. స్నేహితులతో మాట్లాడటం ద్వారా ఉపశమనం ఉంటుంది, మీ మనోధైర్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.



మిథునం
వ్యాపార ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. జీవిత భాగస్వామి సలహాతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. కొత్త పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు.



కర్కాటకం
మీ ఆదాయం పెరుగుతుంది. పనులు కాస్త నిదానంగా సాగుతాయి. మీరు ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా మీకు నచ్చని వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై అదనపు పని ఒత్తిడి ఉంటుంది.



సింహం
మీరు కార్యాలయంలో గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. హోటల్ వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది.



కన్య
మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు.ఆర్థిక విషయాల్లో నిరాశ ఉంటుంది. చర్చల ద్వారా మాత్రమే వివాదాలు పరిష్కారమవుతాయి. ఈరోజు కొంత సమయం స్వీయ విశ్లేషణలో గడపండి.బంధువులను కలుస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.



తులా
ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. కొంచెం కష్టపడితే ఆశించిన ఫలితం ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు.



వృశ్చికం
ఈరోజు మరింత చురుకుగా ఉంటారు.పాత ఆలోచనలను వదిలి కొత్త ఆలోచనలను అలవర్చుకోవాలి. మీ సంకల్ప శక్తి మిమ్మల్ని అణచివేయనివ్వదు. మీ ఎదుగుదల స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.సంతోషంగా ఉంటేందుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.



ధనుస్సు
కార్యాలయంలో అధికారులు మిమ్మల్ని అభినందిస్తారు.మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం పొందాలనుకునే వారు ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు.మీరు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరుకావలసి రావచ్చు. పిల్లల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తొలగిపోతాయి.



మకరం
ఒకరి సలహాను అనుసరించే ముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. బయటి వ్యక్తులతో చర్చించవద్దు. ఈ రోజు మీరు విరుద్ధమైన పరిస్థితిలో చిక్కుకునే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి. నిరుద్యోగులకు కుటుంబ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.



కుంభం
మీరు అధిక పని వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు మంచి సమయం. ప్రయోగాలు భవిష్యత్ లో ప్రయోజనం చేకూరుస్తాయి. . ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి.



మీనం
వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండొచ్చు. సహోద్యోగులు ఏదైనా విషయంలో పొరపాటు చేస్తే వారిని వేధించవద్దు. ఇంటి సభ్యుల అవసరాలు తీర్చండి. సమీప బంధువులతో సమావేశమవుతారు. మీ జీవనశైలి చాలా క్రమబద్ధంగా ఉంటుంది.