విజయ్ 'బీస్ట్' ఏప్రిల్ 13న (బుధవారం) థియేటర్లలో విడుదలవుతోంది. యష్ 'కె.జి.యఫ్ 2' సినిమా ఏప్రిల్ 14న (గురువారం) థియేటర్లలో విడుదలవుతోంది. సోనీ లివ్ ఓటీటీలో ఏప్రిల్ 14 (గురువారం) నుంచి శర్వానంద్, రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' స్ట్రీమింగ్ కానుంది. పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా 'జేమ్స్' కూడా సోనీ లివ్ ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదల రాధిక, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఓటీటీ ఒరిజినల్ సిరీస్ 'గాలివాన' ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫ్యాక్షనిజం, నక్సలిజం నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'దహనం' వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదల అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 15న అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' విడుదల నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఆహా ఓటీటీ ఒరిజినల్ సినిమా 'బ్లడీ మేరీ' విడుదల ఏప్రిల్ 15న 'డెత్ ఆన్ ద నైల్' ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 15న డిస్నీ ప్లస్ హాట్ సార్ ఓటీటీ వేదికలో విడుదలవుతోంది. 'ద కర్దాషియన్స్' రియాలిటీ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కొరియన్ వెబ్ సిరీస్ 'హ్యాపీనెస్' నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ డ్రామా.