గాఢమైన నిద్ర కోసం ఈ పానీయాలు

శరీరానికి ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం. రెండింటిలో ఏది తగ్గినా శరీరం సరిగా పనిచేయలేదు.

ఆహారం సమపాళ్లలో తినడమే కాదు,నిద్ర కూడా ఎనిమిది గంటలకు తగ్గకుండా చూసుకోవాలి.

నిద్ర హార్మోనును అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేసే పానీయాలు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గోరువెచ్చని పాలలో ఒక స్పూను తేనె కలిపి తాగితే చాలా మంచిది. ఈ పానీయం ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. దీంతో నిద్ర ముంచుకొస్తుంది.

ఒక టీస్పూను మెంతులు గ్లాసు నీటిలో నానబెట్టి దాదాపు ఎనిమిది గంటలు వదిలేయాలి. వాటిని రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు తాగాలి.

ఒక కప్పు నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కాసేపు మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా అయ్యాక అందులో తేనె కలిపి తాగితే మంచిది.

భోజనం చేశాక ఒక కప్పు నిండా నల్ల ద్రాక్షలను తింటే మంచిది. లేదా జ్యూసు చేసుకుని తాగినా మంచిదే. వీటిల్లో నిండుగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి.

సాయంత్రం అయిదు దాటాక కాఫీ, టీలు తాగడం మానేయలి. ఇవి నిద్రను దూరం చేస్తాయి.

ఆల్కహాల్, సిగరెట్లు తాగడం మానేయాలి. ఇవి కూడా నిద్ర దేవతను రాకుండా అడ్డుకుంటాయి.