విటమిన్ డితో గుండెపోటుకు చెక్



ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది.



ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా కోటి 79 లక్షల మంది కేవలం హృదయ సంబంధ వ్యాధుల కారణంగానే ప్రాణాలను కోల్పోతున్నారు.



విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతోందని ఒక తాజా అధ్యయనం చెప్పింది.



ఇది గుండెకు రక్షణను కల్పిస్తాయని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని కనుగొనడం నిజంగా ఆశాజనకమైన విషయం.



అయితే విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల నేరుగా గుండె జబ్బులు పూర్తిగా తగ్గిపోతాయని ఈ అధ్యయనం చెప్పడం లేదు.



కానీ గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని ఎంతో కొంత విటమిన్ డి సప్లిమెంట్లు తగ్గిస్తాయని మాత్రం చెబుతోంది.



రోజూ వ్యాయామం చేయడం, పోషకాహారాన్ని తినడం, విటమిన్ డి ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవడం చాలా అవసరం.



విటమిన్ డి లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం.