ఔనండి, మీరు చదివిన టైటిల్ నిజమే. విశ్వక్ సేన్ పులిని పట్టుకున్నాడు.

విశ్వక్‌సేన్ పులితో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. దాని తోకను కూడా నిమిరాడు.

అయితే, అది కాకినాడ పులి అనుకొనేరు, కానే కాదు. అది వేరే, ఇది వేరే!

పులి వద్దకు వెళ్లేప్పుడు పులిలా ఉండాలని విశ్వక్ అనుకున్నాడు కాబోలు!

చిరుతపులి మచ్చల షర్ట్‌ను వేసుకుని మరీ విశ్వక్ పులిని కలిశాడు.

ఇద్దరూ ఏదో బాల్య స్నేహితులన్నట్లుగా విశ్వక్ ఫొటోలకు పోజులిచ్చాడు.

అదేంటీ, ఆ పులి అతడిని ఏం చేయట్లేదని అనుకుంటున్నారా?

మొన్న, అనన్య నాగళ్ల పట్టుకున్న పులి, ఇది ఒకటే.

ఈ పులులు బాల్యం నుంచి మనుషులతో కలిసి పెరిగాయి. అందుకే ఏం చేయవు.

ఈ ఫొటోలు చూసి ‘పులితో వేట, విశ్వక్‌తో ఆట’ రెండు కష్టమే అంటున్నారు ఫ్యాన్స్.

Images Credit: Vishwak Sen/Instagram