ఏనుగులను చూస్తే మనకు సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా చిన్నారులు ఏనుగులను వీక్షించేందుకు ఇష్టపడతారు కొన్నిసార్లు ఏనుగులు గుంపులుగా వెళితే, కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉంటాయి ఏనుగు విద్యుత్ కంచెను చాకచక్యంగా దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటగా కంచె వద్దకు చేరుకున్న ఏనుగు తీగలకు కరెంట్ ఉందా అని పరీక్షించింది. కరెంట్ లేదని తెలుసుకున్నాక తన బలాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది తన బలాన్ని ఉపయోగించి సెకన్ల వ్యవధిలో కంచెను పడగొట్టింది. ఆపై దర్జాగా ఫెన్సింగ్ తీగలను దాటింది ఏనుగు అటుగా వస్తున్న వాహనాలు ఆగడంతో దర్జాగా రోడ్డు దాటేసింది ఏనుగు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏనుగుకు ఎంత యాటిట్యూడ్, తెలివి ఏంట్రా అని నెటిజన్లు షాకవుతున్నారు