ముఖమంతా చెక్కేసి భయానకంగా కనిపిస్తున్న ఇతడు మనిషే. తనని తాను ‘బ్లాక్ ఏలియన్’గా పిలుచుకొనే ఇతడి అసలు పేరు ఆంథోని లోఫ్రెడో. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనికి గ్రహాంతరవాసిగా మారాలనేది కోరిక. అందుకే, అతడు 27 ఏళ్ల వయస్సు నుంచి శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకుంటున్నాడు. అంతటితో ఆగకుండా అతడు తన ముక్కు, పెదాలు, చెవులు, వేళ్లను కత్తిరించుకున్నాడు. ఆంథోని తన నాలుకను పాము తరహాలో రెండుగా చీల్చుకున్నాడు. ఆంథోని అంతటితో సంతృప్తి చెందలేదు. తన కాలిని కూడా కట్ చేయించుకుంటాడట. ఒక కాలును మోకాలి వరకు కట్ చేయించుకుని కొత్తగా కనిపించాలని అనుకుంటున్నాడు. తన భయానక రూపంతో ప్రజలను భయపెట్టాలని ఉందని, సినిమాల్లో ఛాన్స్ కావాలని తెలిపాడు. Image Credit: the_black_alien_project/Instagram