కూతురి సమాధి వద్ద జన్మదిన వేడుకలు, కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

కన్నబిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా తల్లిదండ్రులు అల్లాడిపోతారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప చనిపోవడంతో తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు

చిన్నారి చనపోయిన నెల రోజులకే పుట్టినరోజు వచ్చింది.

కన్న కూతురి సమాధి వద్ద జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఆ తల్లితండ్రులు

జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండలానికి చెందిన కొప్పుల రాజు, రసజ్ఞ దంపతులకు కూతురు జ్ఞానన్వి(4) ఉంది

గత నెల 8న చిన్నారి విష జ్వరంతో మృతి చెందింది.

కన్న కూతురు జ్ఞానన్వి పుట్టిన రోజు కావడంతో కూతురి సమాధి వద్దకు వెళ్లారు.

సమాధి వద్ద కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేశారు.

ఫొటోకు కేక్ తినిపిస్తూ తల్లి రోదించిన తీరు చూసేవాళ్లను సైతం కంటతడి పెట్టించింది.