విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా ‘మెర్రీ క్రిస్మస్’.

సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.

బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ‘మెర్రీ క్రిస్మస్’కు దర్శకత్వం వహించారు.

గతంతో ‘బదలాపూర్’, ‘అంధాధున్’ వంటి క్లాసిక్స్‌ను శ్రీరామ్ తెరకెక్కించాడు.

దీంతో ‘మెర్రీ క్రిస్మస్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగులో ఈ సినిమా విడుదల కాబోవడం లేదు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి, కత్రినా ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తమిళం, హిందీలో వేర్వేరు ఆర్టిస్టులతో తెరకెక్కించారు.

మరి రెండు భాషలకు వేర్వేరు వెర్షన్లు తీస్తున్నారా? ఒకే వెర్షన్ తీస్తున్నారా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.