విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా JGM. మార్చి 29న ముంబైలో ఓపెనింగ్ జరిగింది.

ఓపెనింగ్‌లో విజయ్ దేవరకొండ హెలికాఫ్టర్ నుంచి దిగడం, ఆయన ఆర్మీ గెటప్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

శ్రీకర స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన మై హోమ్ గ్రూప్, JGM Movieతో సినిమా నిర్మాణంలో అడుగు పెట్టింది. 

శ్రీకర స్టూడియోస్ తరపున వంశీ పైడిపల్లి JGM Movie - జెజిఎమ్ (జన గణ మణ) చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

JGMలో గతంలో చేయనటువంటి పాత్ర చేస్తున్నానని, ప్రతి భారతీయుడిని టచ్ చేసి చిత్రమిదని విజయ్ దేవరకొండ చెప్పారు. 

పాన్ ఇండియా సినిమాగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఏప్రిల్ నెలలో 'JGM' మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.

దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు.

సినిమా ఓపెనింగ్ రోజునే  వచ్చే ఏడాది ఆగస్టు 3న చిత్రాన్ని (JGM Movie) విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.