శుభకృత్ నామసంవత్సరంలో వృషభరాశివారికి అధ్భుతంగా ఉంది. ఈ ఏడాది వీరిపై గురుబలం అధికంగా ఉండడంతో అన్నంటిలోనూ పైచేయి సాధిస్తారు.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు, కేతువు శుభస్థానంలో ఉండడంతో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని, కార్యనిర్వహణా సామర్థ్యాన్ని ఇస్తాడు
ఉద్యోగ పరంగా శ్రమకు తగిన గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది స్థిరాస్తులు,నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు మీకు మంచి సమయం అప్పుల బాధలు తీరుతాయి, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మార్కెట్ రంగంలో ఉన్నవారు టార్గెట్ లు అధిగమిస్తారు. వ్యాపారులకు ఉగాది నుంచి మొదటి ఆరు నెలల కన్నా తర్వాత ఆరునెలలు బావుంటుంది విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది
వాహనం నడిపేటపుడు జాగ్రత్తగా ఉండండి. అసాంఘిక కార్యకలాపాలకూ దూరంగా ఉండండి దశమంలో శనివల్ల మానసిక ఒత్తిడి అధికంగా, మనశ్సాంతి తక్కువగా ఉంటుంది
12 లో రాహువు ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి, స్థలమార్పులు, గృహమార్పులు ఉంటాయి
కొన్నిసార్లు అనాలోచిత నిర్ణయాల వల్ల తప్పటడుగు వేసే అవకాశం ఉంది, దుష్టులను మంచివారు అనుకుని భ్రమపడతారు, అయితే వారినుంచి నష్టం జరిగేలోగా కోలుకుంటారు
పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవు కానీ అప్పుడప్పుడు కొంచెం నలతగా ఉంటుంది
జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా అన్యోన్యత ఉంటుంది
విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది..జాగ్రత్త