మేషం మీ ఆదాయం పెరుగుతుంది.ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది.ముఖ్యమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవచ్చు. నిలిచిపోయిన ప్రణాళికల బూజు దులపండి. మీ పూర్తి శ్రద్ధ ఇంటిపైనైే ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు
వృషభం ఇంట్లో సంతోషం వాతావరణం ఉంటుంది.కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మనశ్శాంతిగా ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీ మనసులో మథనం జరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తుల వల్ల ఇబ్బంది పడతారు
మిథునం విద్యార్థులకు రోజు చాలా మంచిది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం ఈరోజు కర్కాటక రాశి వారికి గృహ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మరింత జాగ్రత్తగా ఉండండి.ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
సింహం జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపార పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. తెలివిగా లావాదేవీలు చేయండి.
కన్య కెరీర్‌లో పురోగతి కోసం ప్రయత్నిస్తారు.రుణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.
తులా ఈరోజు మీ పెద్ద సమస్య తొలగిపోతుంది.ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంతో కలసి ఎక్కడికైనా వెళేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో పెద్ద లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. మీ సలహాతో ఎవరి పనైనా పూర్తి అవుతుంది.
వృశ్చికం ఈరోజు మంచి రోజు అవుతుంది. చాలా బాధల నుంచి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన పనులన్నీ పూర్తిచేస్తారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కార్యాలయంలో ఆదాయ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.
ధనుస్సు వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. మునుపటి పెట్టుబడుల నుండి పెద్ద లాభాలు ఉండవచ్చు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి.
మకరం కార్యాలయంలో ఆధిపత్యం ఉంటుంది.ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. మీ వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి.కొత్త ఉద్యోగం పొందవచ్చు. కార్యాలయంలో అధికారులతో సమావేశం అవుతారు.అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. పార్టీల్లో పాల్గొంటారు.
కుంభం మీరు ఈరోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు.స్నేహితుల సహకారంతో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.వ్యాపారంలో లాభం ఉంటుంది.అందరి ప్రశంసలు అందుకుంటారు.ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రమోషన్ పొందుతారు.
మీనం ఉన్నతాధికారుల సూచనలు పాటించండి. అనారోగ్య సమస్యలుంటాయి.కొంతమందికి మీపై కోపం రావచ్చు. సరికాని ఆహారం వల్ల ఇబ్బంది ఉంటుంది.ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.