మాంసాహారం అధికంగా తింటే ఈ రోగాలొచ్చే అవకాశం

మనం తినే అతి తిండి వల్ల కూడా కొన్ని రోగాలు విరుచుకుపడతాయి.

మితిమీరి మాంసం తినడం వల్ల ఆరోగ్యపరిస్థితుల్లో తేడా రావచ్చు.

మాంసాహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శరీరంలో మోతాదుకు మించి ప్రోటీన్ చేరడం వల్ల కూడా అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి.

మోతాదుకు మించి మాంసం తినడం వల్ల వచ్చే రోగాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

కొవ్వు,ఉప్పు అధికంగా ఉండే మాంసాహారం పరిమితికి మించి తింటే గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.

బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా మాంసాహారాన్ని చాలా వరకు తగ్గించాలి.

అధిక మాంసాహారం తినడం వల్ల బరువు పెరగడం, కొవ్వు పేరుకుపోవడం వంటివి కలుగుతాయి. ఇవి మధుమేహం వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

మాంసం అధికంగా తినడం వల్ల చెమట కూడా అధికంగా పడుతుంది.ఈ సమస్యను ‘మీట్ స్వెట్స్’ అంటారు.

అధికంగా మాంసాహారం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి.

కాబట్టి మాంసాహారాన్ని కప్పుల కొద్దీ లాగించకుండా పరిమితంగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.