తన కెరీర్‌ ప్రారంభంలో చేసిన గ్లామర్ రోల్స్‌పై విద్యా బాలన్ స్పందించారు.

అలాంటి సినిమాలు హిట్టయినా తనకు సంతృప్తి లభించేది కాదన్నారు.

హీరోలను ప్రేమించే అమ్మాయి పాత్రలు తనకు అంత కిక్కిచ్చేవి కాదని పేర్కొన్నారు.

అటువంటి పాత్రలు చేసేటప్పుడు నిద్రలో నడుస్తున్నట్లు ఉండేదన్నారు.

కానీ ‘ఇష్కియా’ సినిమాతో ఆ పరిస్థితి మారిందని తెలిపారు.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యా బాలన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2011లో వచ్చిన ‘ది డర్టీ పిక్చర్’ సినిమాతో విద్యా బాలన్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.

విద్యా బాలన్ ప్రస్తుతం నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘నీయత్’ త్వరలో విడుదల కానుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా నేరుగా స్ట్రీమ్ కానుంది.