అల్లం కూరలకి మంచి రుచి ఇవ్వడమే కాదు సరిగా వాడితే మీకు అందాన్ని తెచ్చిపెడుతుంది. అల్లం, తేనె, పంచదార కలిపి ఫేస్ స్క్రబ్ వేసుకోవచ్చు. మృతకణాలు తొలగిస్తుంది. బాడీ స్క్రబ్ గా అల్లం పని చేస్తుంది. సముద్రపు ఉప్పు లేదా చక్కెరతో అల్లం రసం కలుపుకుని రాసుకోవచ్చు. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. తాజాగా తురిమిన అల్లంలో ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె కలుపుకుని జుట్టుకి అప్లై చేసుకోవచ్చు. మెరిసే జుట్టుని అందిస్తుంది. అల్లం, తేనె కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. ఇది ఎరుపు, వాపుని తగ్గిస్తుంది. స్నానం చేసే నీటిలో అల్లం రసం లేదా అల్లం నూనె వేసుకోవచ్చు. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఆలివ్ నూనె, అల్లం కలిపి ఒక జార్ లో ఉంచుకోవాలి. ఈ నూనె శరీరానికి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. అల్లం టీ చర్మాన్ని రీఫ్రెష్ చేసేందుకు టోనర్ గా పని చేస్తుంది. టీలో దూది ముంచి మొహానికి రాసుకోవచ్చు. ఆలివ్ లేదా జోజోలా ఆయిల్ లో అల్లం రసం జోడించి గోర్లు, క్యూటికల్స్ మసాజ్ చేసుకోవచ్చు. అల్లం, తేనె, పంచదారతో లిప్స్ స్క్రబ్ చేసుకోవచ్చు. Images Credit: Pexels