ఉర్ఫీ జావెద్.. పిచ్చి ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఉర్ఫీ ఏం చేసినా ఫ్యాన్స్ భరిస్తారు. ఎందుకంటే ఈమె ధరించే డ్రెస్‌లో కొ(చె)త్తదనం ఉంటుంది. అందుకే, ఉర్ఫీ ఫొటోల కోసం కుర్రాళ్లు పిచ్చిగా ఎదురుచూస్తుంటారు. మీరు గుండె సూది ఇచ్చినా, ఆమె డ్రెస్‌లా ధరించేస్తుంది. ఇటీవల పగిలిన గాజు పెంకుల డ్రెస్ వేసుకుని గాయపడింది. అయినా సరే, పట్టువదలని పిశాచిలా కొత్త డ్రెస్‌లను ధరిస్తూనే ఉంది. కొద్దిరోజుల కిందట ఆమె గోనె సంచిని డ్రెస్‌గా ధరించింది. తాజాగా పూల బికినీ ధరించి.. లేడీ టార్జన్‌లా మారిపోయింది. Credits: Urfi Javed/Instagram