ముంబై ఉర్ఫీ జావేద్ (Urfi Javed)ను ఈ రోజు చూసిన జనాలు ఎవరైనా 'మీరు మారిపోయారు మేడమ్' అంటారేమో!? ఎప్పుడూ నిండుగా దుస్తులు వేసుకునే వాళ్ళు ఒక్కసారిగా అందాల ప్రదర్శన చేస్తే జనాలు షాక్ అవుతారు. ఎప్పుడూ అందాల ప్రదర్శన చేస్తూ చిట్టి పొట్టి దుస్తులు ధరించే భామలు ఒక్కసారిగా పద్ధతిగా కనిపించినా షాక్ తప్పదు. ఉర్ఫీ జావేద్ ను ఈ డ్రస్ లో చూసిన ప్రేక్షకులు ఎవరైనా సరే షాక్ తినక తప్పదు. ఎందుకంటే... ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ స్టైల్, స్టేట్మెంట్ గమనిస్తే... ఇవి నిండైన దుస్తులు కిందే లెక్క! బికినీ కంటే చిన్న సైజు దుస్తులను ఉర్ఫీ జావేద్ వేసుకున్న సందర్భాలు కోకొల్లలు. దుస్తులు వేసుకుంటే తనకు ఎలర్జీ వస్తుందన్నట్లు ఆమె చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి ఉర్ఫీ జావేద్ మనసు ఎందుకు మారిందో మరి? ఈ రోజు ఈ డ్రస్ లో ప్రేక్షకులకు దర్శనం ఇచ్చారు. ఉర్ఫీ జావేద్ (All Images Courtesy : Manav Manglani)