ప్రొటీన్ ను బరువు తగ్గించే పోషకంగా పేరు గాంచింది. కండర పుష్టికి, ఆరోగ్యకరమైన జీవక్రియలకు దోహదం చేస్తుంది.

అయితే కొన్ని రకాల ప్రొటీన్ రిచ్ ఫుడ్ వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. అవేమిటనేది తెలుసుకుందాం.

ప్రాసెస్డ్ మీట్ లో సోడియం, అనారోగ్యకరమైన ఫ్యాట్స్, ఉంటాయి. ఇవి బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి.

పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ ఎక్కువ. కానీ వీటిలో సంతృప్త కొవ్వులు ఉన్నాయి.

అందుకే తక్కువ కొవ్వు కలిగిన పదార్థాలను ఎంచుకోవడం మంచిది.

చికెన్ లో లీన్ ప్రొటీన్ ఉంటుంది. కానీ నూనెలో వేయించినపుడు అనారోగ్య కొవ్వులుగా మారుతాయి.

వేయించిన చికెన్ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

చాలా మంది ప్రొటీన్ బార్స్ ఆరోగ్యవంతమైన స్నాక్స్ గా పరిగణిస్తారు.

కానీ వీటిలో కృత్రిమ చక్కెరలు, ఇతర పదార్థాలు చేరుతాయి. వాటి వల్ల బరువు పెరగవచ్చు.

ఫ్లేవర్డ్ యోగర్ట్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు.



లోఫ్యాట్ యోగర్ట్ లో తేనె, పండ్లు కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చీజ్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రాసెస్డ్ చీజ్ లో సోడియం, సాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటి వల్ల బరువు పెరుగుతారు.

Representational Image : Pexels