గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల మెడ నొప్పి కలుగుతుందని అనుకుంటారు. కానీ మెడ నొప్పి రావడానికి అది మాత్రమే కాదు ఎవరూ ఊహించని కారణాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో మెడ నొప్పి అధికంగా ఉంటుంది. సరైన బ్రాను ధరించనప్పుడు కండరాలు, స్నాయువులు మీద అధిక శ్రమ పడుతుంది. దీని వల్ల నొప్పి వస్తుంది. స్లీపింగ్ పొజిషన్ మెడకి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తాయి. ఎక్కువ మంది ఫోన్స్ చూసేటప్పుడు మెడ నేల వైపు చూస్తుంది. దీని వల్ల కండరాలు ఒత్తిడికి గురవుతాయి. చాలా మంది కూర్చున్నప్పుడు మెడ కిందకి వచ్చి ఎక్కువ సేపు అలాగే ఉండిపోతారు. అది వీపు, మెడకి మంచిది కాదు. ఒత్తిడి వల్ల మెడ కండరాలు బిగుసుకుపోయినట్టుగా మారిపోతాయి. భుజాల మీద దాని ప్రభావం పడుతుంది.