ఈ గొడుగే ఆ గొడవకు కారణం ఇప్పుడు ఒక గొడుగు కారణంగా రెండు అంతర్జాతీయ సంస్థలు ట్రోలింగ్ బారిన పడ్డాయి. గొడుగు ఎందుకు వాడతాం? ఎండా వానల నుంచి రక్షణ కోసం కదా. ఈ ఫోటోలో కనిపిస్తున్న గొడుగు వానలో వేసుకుంటే మాత్రం తడిసి ముద్దయిపోతారు. దీంతో అసలు దీన్ని గొడుగుని ఎలా అంటారు? అంటూ ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. పోనీ ఈ గొడుగు ధరేమైనా తక్కువా అంటే అదీ కాదు, ఒక లక్షా 27 వేల రూపాయలు. ఈ గొడుగును మార్కెట్లోకి దించింది అంతర్జాతీయ సంస్థలైన గూచీ, ఆడిదాస్. భారీ ట్రోలింగ్ బారిన పడడంతో గూచీ సంస్థ వివరణ ఇచ్చింది. ‘మేము ముందుగానే చెప్పాం ఇది కేవలం అలంకరణకు లేదా సూర్యుని నుంచి రక్షణకు మాత్రమే పనికివస్తుంది’అని ప్రకటన చేసింది.