ట్విట్టర్ తన యాప్‌లో అందుబాటులోకి తీసుకురానున్న కొత్త ఫీచర్లను ప్రకటించింది.

ట్విట్టర్‌లో క్యారెకర్ల లిమిట్‌ను 280కు మించి పెంచే అవకాశం ఉంది.

దీంతోపాటు క్లోజ్డ్ క్యాప్షన్ టాగిల్ అనే ఫీచర్‌ను కూడా తీసుకురానుంది.

దీని ద్వారా వినికిడి లోపం ఉన్న వినియోగదారులకు వీడియోలు మరింత యాక్సెసబుల్ కానున్నాయి.

ఆటో క్యాప్షన్లు 30కి పైగా భాషల్లో అందుబాటులోకి రానున్నాయి.

క్యాప్షన్స్ అందుబాటులో ఉన్న వీడియోలకు పైన సీసీ అనే బటన్ కనిపిస్తుంది.

దీంతోపాటు ట్విట్టర్ స్పేస్ హోస్టింగ్ మరింత సులభం కానుంది.

రీట్వీట్ బటన్ ద్వారా స్పేస్ స్టార్ట్ చేస్తే వెంటనే అది లైవ్ అవుతుంది.

ఆ రీట్వీట్ మెనూ ద్వారా హోస్ట్‌లు, స్పీకర్లు... ట్వీట్లను షేర్ చేయవచ్చు.

త్వరలో మరిన్ని ఫీచర్లు కూడా ట్వీటర్ తీసుకురానుంది.
(All Images Credits: Pixabay)