రాకాసి మిరపకాయ, తింటే అంతే సంగతులు

ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయ ఇది.

ఈ మిరపకాయ పేరు భూత్ జోలోకియా. దీన్ని భూటాన్ పెప్పర్ అని కూడా పిలుస్తారు.

ఇది నాగాలాండ్, అసోంలలో పండుతుంది.

భూత్ అంటే అస్సామీ భాషలో దెయ్యం అని అర్థం. అందుకే దీన్ని ఆంగ్లంలో ‘ఘోస్ట్ పెప్పర్’ అని పిలవసాగారు.

ఈ రాకాసి మిరపకాయ 2007లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.

ప్రపంచంలోనే అత్యంత కారమైన మిరపకాయలుగా ఇవి రికార్డుల్లో చోటు సంపాదించాయి.

ఈ మిరపకాయ తింటే నాలుక మండిపోయి విలవిలలాడిపోతారు.

ఆత్మరక్షణ కోసం వాడే పెప్పర్ స్ప్రేలను తయారుచేయడానికి ఈ మిరపకాయలు వినియోగిస్తారు.