మేషం ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది కానీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగడంతో ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం ఉంది.
వృషభం ఈ రోజు సాధారణంగా ఉంటుంది. తలపెట్టిన పని పెద్దగా ఫలితాన్నివ్వదు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటేనే విజయం సాధించగలగుతారు.పార్టీలను ఆనందిస్తారు.
మిథునం ఈ రోజు ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థికంగా లాభపడే అవకాశాలుంటాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. మీ సామర్థ్యంతో కష్టాల నుంచి బయటపడగలుగుతారు. మీ పని తీరు మెరుగుపడుతుంది.
కర్కాటకం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. వ్యాపారంలో పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రయాణానికి అనుకూలమైన రోజు. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి.
సింహం ఈ రోజు మీకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడటం వల్ల నష్టం కలుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
కన్య వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలు పొందే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయొద్దు. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు.మీ పనిలో వేగాన్ని పెంచండి.
తుల వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కృషిపై నమ్మకం ఉంచండి. వ్యాపార విస్తరణ కోసం మీరు కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. అధికారుల సహకారం ఉంటుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు.
వృశ్చికం ఉద్యోగం, వ్యాపారంలో ఆకస్మికంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చేపట్టే పనిలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆస్తిపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం మందగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.
ధనుస్సు వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలుండొచ్చు. శ్రమకు తగిన విజయం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది.
మకరం ఆకస్మిక లాభాలు పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగం లాభిస్తుంది. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కుంభం ది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పాత పెట్టుబడులు, పాత స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. షేర్, ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగుల పరిస్థితి అంత బాగా ఉండదు. కుటుంబ సమస్య కూడా ఉంటుంది.
మీనం కష్టపడి పని చేస్తే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆలోచనాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.