మొటిమలు వివిధ కారణాల వస్తాయి. వాటికి సంబంధించిన మచ్చలను వదిలి వెళ్తాయి. కొన్నిసార్లు ఎన్ని ప్రొడెక్ట్స్ వాడినా.. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పింపుల్స్ తగ్గించుకోవడానికి అప్లై చేయాల్సిన క్రీమ్స్పై కాకుండా ఫుడ్పై ఇంట్రెస్ట్ పెట్టాలి. కొన్ని ఆహారాలు వెంటనే తినడం ఆపేస్తే మొటిమలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ప్రోటీన్ పౌడర్ ఉపయోగించేవారు దానిని వెంటనే ఆపేయాలి. పాలకు సంబంధించిన ఉత్పత్తులు మోతాదుకు మించి తీసుకోవడం బంద్ చేయాలి. కార్న్ ఫ్లేక్స్ తినే అలవాటు ఉంటే వెంటనే దానిని మానేయండి. దీనిలో చర్మానికి హాని కలిగించే షుగర్ ఉంది. ఇది పింపుల్స్ వచ్చేలా చేస్తుంది. (Image Source : Unsplash, Pinterest)