హార్ట్ పేషెంట్లకు ముఖ్యమైన ట్రావెల్ టిప్స్

గుండె జబ్బులు ఉన్నవాళ్లు ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడరు.కానీ కొన్ని జాగ్రత్తలతో వారు ట్రావెల్ చేయచ్చు.

ట్రావెలింగ్ మొదలుపెట్టే ముందు కార్డియాలజిస్టును కలిసి ఈసీజీ, స్ట్రెస్ టెస్ట్ చేయించుకోవాలి.

వైద్యులు మీరు ఫిట్ గా ఉన్నట్టు చెబితే ఫర్వాలేదు.

కోవిడ్ 19 వ్యాక్సిన్, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి వ్యాక్సిన్లు వేసుకోండి.

లాంగ్ జర్నీలు చేయాల్సి వస్తే నీళ్లు అధికంగా తాగుతూ ఉండండి. అధిక సమయం కూర్చోకుండా తరచూ ఇటూ అటూ తిరుగుతూ ఉండాలి.

ఆహారం విషయంలో జాగ్రత్త పడండి. తాజా ఆహారాన్నే తినేలా చూసుకోండి.

ఎట్టి పరిస్థితుల్లోనూ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినవద్దు.

వాకింగ్ మాత్రం విస్మరించవద్దు. ఎక్కడున్నా వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చేయండి.

ఏమాత్రం కష్టంగా అనిపించినా వెంటనే దగ్గర్లో ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకోవాలి.