అనసూయ భరద్వాజ్ యాంకరింగ్, సినిమాలతో చాలా బిజీగా ఉంది. అంత బిజీలోనూ సోషల్ మీడియాలో తన అభిమానులను అలరిస్తూనే ఉంది. ఒకే టికెట్‌కు 2 సినిమాలున్నట్లుగా అనసూయ.. లంగావోణి, మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది. లంగావోణిలో కనిపించిన 4 గంటల వ్యవధిలోనే మోడ్రన్ డ్రెస్‌లో ప్రత్యక్షమైంది. దీన్ని బట్టి అనసూయ ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. లంగావోణితో డ్రెస్‌తో ‘సూపర్ సింగర్స్’ షోలో అను కనిపించింది. యెల్లో డ్రెస్‌లో ‘అరి’ మూవీ టైటిల్ రిలీజ్ కార్యక్రమంలో అనసూయ పాల్గొంది. సాధారణంగా అనసూయ వారంలో ఒకసారి ‘జబర్దస్త్’ షో పిక్స్ మాత్రమే షేర్ చేస్తుంది. ఈసారి మాత్రం ఒకే రోజు రెండు ఫొటోషూట్స్ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. వెంట వెంటనే పోస్టులు చేస్తున్నావ్, కాస్త గ్యాప్ ఇవ్వొచ్చుగా అని ఫాలోవర్స్ అంటున్నారు. అనసూయ ఏ డ్రెస్‌లోనైనా సరే అందంగానే ఉంటుందని అభిమానులు అంటున్నారు. Images and Videos Credit: Anasuya Bharadwaj/Instagram