జూన్ 26 రాశి ఫలాలు



మేషం
వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. స్నేహితులు, ప్రేమ సంబంధాలపై మీ ఆలోచన మారుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్త వింటారు. రహస్య విషయాలపై ఆసక్తి చూపుతారు. ఈ రోజంతా ఓపికగా ఉండాలి.



వృషభం
ఎప్పటి నుంచో సాగుతున్న వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తవుతాయి. ప్రేమికులకు మంచి రోజు. ఆధ్యాత్మికతపై ఆసక్తిని కలిగి ఉంటారు. అన్ని పనులు సులభంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు.



మిథునం
నిర్లక్ష్యం, సోమరితనం వల్ల మంచి అవకాశాలు మీచేతుల్లోంచి జారిపోతాయి. బంధువులను కలుస్తారు. వ్యాపారంలో సమస్యలుంటాయి. నెలవారీ బడ్జెట్ గందరగోళంగా ఉంటుంది.మీ వ్యక్తిగత పనుల్లో జోక్యం చేసుకునే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి.



కర్కాటకం
కార్యాలయంలో సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. పిల్లల విజయాల వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది.



సింహం
మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు. దిగుమతి-ఎగుమతికి సంబంధించిన వ్యాపారులు అద్భుతమైన లాభాలు సాధిస్తారు. మీ కుటుంబానికి సమయం ఇస్తారు. ప్రేమికులు సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.



కన్యా
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నవారికి మంచిరోజు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ సలహాలు పాటించిన వారు సక్సెస్ అందుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. స్నేహితుల కారణంగా కొంత టెన్షన్ ఉంటుంది. ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది.



తులా
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పాత స్నేహితులను కలుస్తారు కానీ వారికి తగినంత సమయం ఇవ్వలేరు. తప్పనిసరి అయితే కానీ ప్రయాణం చేయవద్దు. ఏ పని చేయాలని అనిపించదు. మీ బలహీనతలను బయటపెట్టొద్దు.



వృశ్చికం
మీ పని తీరు మెరుగుపడుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.



ధనుస్సు
ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వెంటాడతాయి. కుటుంబ సభ్యులతో స్పెండ్ చేస్తారు. ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందాలు జాగ్రత్తగా చేసుకోండి. పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ఎవరికీ సలహా ఇవ్వకండి.



మకరం
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. అనుకోని ప్రయాణం చేయవలసి రావచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. బిజీ కారణంగా కుటుంబానికి సమయం కేటాయించలేరు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో చర్చలుజరుపుతారు.



కుంభం
ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు.రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు పెద్ద పదవిని పొందుతారు. కార్యాలయంలో కొన్ని పనులు నిర్వర్తించే విషయంలో చిన్న వివాదం జరగొచ్చు. ఆలస్యం అవుతుంది కానీ తలపెట్టిన పనులు పూర్తవుతాయి. అపరిచితులను నమ్మొద్దు.



మీనం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మతపరమైన యాత్రలు ప్లాన్ చేస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. ఔషధ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది.