మగవారిలో టెస్టోస్టెరాన్ తగ్గితే అంతే సంగతులు



టెస్టోస్టెరాన్ అనేది సెక్స్ హార్మోన్. మగవారిలో సెక్స్ డ్రైవ్‌కు అతి ముఖ్యమైన హార్మోన్ ఇది.



మగవారిలో టెస్టోస్టెరాన్ తగ్గితే అనేక విషయాల్లో సమస్యలు మొదలవుతాయి.



టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గితే మీకు సెక్స్ పరమైన ఆలోచనలేవీ రావు.



స్పెర్మ్ కూడా చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది.

టెస్టోస్టెరాన్ తగ్గి, ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగితే మగవారిలో ఆడవారిలోలాగా ఛాతీ పెరుగుతుంది.



వారిలో సెక్స్ పరమైన స్పందనలు చాలా తగ్గిపోతాయి.



ఎలాంటి పనులు చేయకపోయినా అలసిపోయినట్టు నీరసంగా ఉంటారు.



డిప్రెషన్ గా, నిరాశగా కనిపిస్తారు. టెస్టోస్టెరాన్ తగ్గితే డిప్రెషన్ బారిన పడే అవకాశం ఎక్కువ.