ABP Desam


జూన్ 25 శనివారం రాశిఫలాలు


ABP Desam


మేషం
కుటుంబ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు.కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి భాగస్వాములు దొరుకుతారు. కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.


ABP Desam


వృషభం
చాలా కాలం తర్వాత పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. మీ పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయండి. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉంటారు. వ్యాపారంలో నిథుల కొరత వల్ల ఇబ్బంది పడతారు. బంధువులతో సంత్సంబంధాలుంటాయి.


ABP Desam


మిథునం
కార్యాలయంలో సహోద్యోగుల సహకారంతో మీరు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉంటారు. హోల్‌సేల్ వ్యాపారులు వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. కోపం తెచ్చుకోవడం వల్ల మీకే హాని కలుగుతుంది.


ABP Desam


కర్కాటకం
కుటుంబం కోసం సమయం వెచ్చిస్తారు. సామాజిక కార్యక్రమాలను వాయిదా వేయవచ్చు. మీరు రుణ మొత్తాన్ని తిరిగి పొందగలుగుతారు. ధనలాభం పొందే పరిస్థితి ఉంటుంది. కొంతమంది బంధువులు ఇంటికి రావచ్చు. పిల్లల విజయంతో ఉత్సాహంగా ఉంటారు.


ABP Desam


సింహం
మీ సంపద పెరుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.పనికిరాని పనుల్లో మునిగిపోకండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది.


ABP Desam


కన్యా
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. వివాహేతర సంబంధాల్లో నష్టాలుంటాయి. మీ గౌరవం తగ్గుతుంది. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మొద్దు. అతిగా ఆలోచించడం వల్ల సమయం వృథా అవుతుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఆసక్తి చూపడం మంచిది కాదు.


ABP Desam


తులా
ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోకండి. ఈ రోజు గొప్పవారిని కలుస్తారు. పిల్లల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈరోజు కుటుంబానికి తగినంత సమయం ఇస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అధికారులతో సమావేశం కలిసొస్తుంది.


ABP Desam


వృశ్చికం
వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కలిసొచ్చే సమయం ఇది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనుకుంటే తెలివిగా వ్యవహరించండి. కొన్ని సీక్రెట్ విషయాలపై ఆరాలు తీయడం మొదలెడతారు. ఆధ్యాత్మిక విషయాలపై అధ్యయనం చేస్తారు.


ABP Desam


ధనుస్సు
తొందరపాటులో తప్పులు జరుగుతాయి జాగ్రత్త. ప్రయాణంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గాయపడే ప్రమాదం ఉంది. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు పొందే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు


ABP Desam


మకరం
దూరప్రయాణం చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉంటాయి. పనిభారం వల్ల కొన్ని చికాకులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒకరి మాటనమ్మి మీ ప్రియమైన వారిని అనుమానించకండి. దురాశ వల్ల కొంత నష్టపోతారు.


ABP Desam


కుంభం
వ్యాపార సంబంధిత సమస్యలను కుటుంబ సభ్యులతో చర్చించవచ్చు. ఇతరులపై ఆధారపడొద్దు. మీ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వీడండి. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు.


ABP Desam


మీనం
ఆఫీసులో సహోద్యోగులతో మనస్పర్థలు రావొచ్చు. మీ పని నైపుణ్యం మెరుగుపడుతుంది. టెక్నికల్ ఫీల్డ్‌పై అవగాహన పెంచుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఎక్కువ పని చేసిన తర్వాత కూడా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది.