ప్రియాంక జవాల్కర్.. ‘ట్యాక్సీవాలా’తో హాయ్ చెప్పిన ఈ క్యూటీ గుర్తుందా? ‘SR కళ్యాణమండపం’ తర్వాత ప్రియాంక మళ్లీ కనిపించలేదు. సినిమాలో ఛాన్సుల కోసం ప్రియాంక బరువు కూడా తగ్గింది. ప్రస్తుతం ఆమె మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు టాక్. కానీ, అప్‌డేట్స్ లేవు. ఇటీవల ఓ క్రికేటర్‌తో ప్రేమాయణమంటూ ప్రియాంక వార్తల్లోకి ఎక్కింది. ఆ వార్తతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారు. తాజాగా ప్రియాంక ఓ అబ్బాయితో ఉన్న ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటో క్యాషన్‌లో ‘Him’ అంటూ లవ్ సింబల్ పెట్టింది. దీంతో అతడు నీ బాయ్ ఫ్రెండా? అని ఫాలోవర్లు అడుగుతున్నారు. కానీ, ప్రియాంక మాత్రం అసలు సంగతి చెప్పడం లేదు. Image Credit: Priyanka Jawalkar/Instagram