వెండితెరపై తొలి రాముడు యడవల్లి సూర్యనారాయణ. శ్రీరామ పాదుకా పట్టాభిషేకం సినిమాలో రాముడిలా నటించారు.

ఏఎన్‌ఆర్ తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం సీతా రామ జననం. ఇందులో రాముడిగా మెప్పించారు అక్కినేని.

వెండితెర రాముడు అంటే నందమూరి తారకరామారావే. శ్రీరామ పట్టాభిషేకం, లవకుశ సినిమాల్లో ఆ పాత్రకు జీవం పోశారు.

పౌరాణిక చిత్రాల్లో మెప్పించిన నటుడు హరనాథ్ కూడా సీతారామ కల్యాణం చిత్రంలో రాముడిగా నటించారు. దీనికి డైరెక్టర్ ఎన్‌టీఆర్.

బాపు డైరెక్ట్ చేసిన సంపూర్ణ రామాయణము చిత్రంలో రాముడిగా కనిపించారు శోభన్ బాబు.

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాల రాముడిగా మెప్పించారు జూనియర్ ఎన్‌టీఆర్.

రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన శ్రీరామదాసు మూవీలో రాముడి పాత్రలో ఒదిగిపోయి అందరి ప్రశంసలు అందుకున్నారు సుమన్.

బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో బాలకృష్ణ రాముడి పాత్రలో నటించారు. ఆ ఆహార్యంతో అందరినీ కట్టిపడేశారు.

ఆదిపురుష్‌ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించి ఫ్యాన్స్‌ని అలరించారు. (Image Credits: Youtube, Manacine)