పొట్టిగా ఉన్నారా? ఇలా డ్రెస్ చేసుకుంటే హీరోలా కనిపిస్తారు

వదులైన దుస్తులు ధరించవద్దు. కాస్త ఫిట్‌గా ఉండే డ్రెస్ మాత్రమే వేసుకోండి.

మీరు వేసుకొనే షార్ట్స్ మోకాలికి పైనే ఉండాలి. కిందికి ఉంటే మరింత పొట్టిగా కనిపిస్తారు.

నడుము పైకి ఉండే హైవీస్ట్ ఫ్యాంట్స్ ధరించండి. దానివల్ల కాళ్లు పొడవుగా కనిపిస్తాయి.

బ్యాగీ ఫ్యాంట్స్ వద్దు. ఫ్యాంట్ కింది భాగం సన్నగా ఉంటేనే మీరు పొడవుగా కనిపిస్తారు.

అలాగే పొడవుగా ఉండే టీషర్టులు ధరించకూడదు. మీడియం షర్టులే బాగుంటాయి.

కాస్త పొట్ట తగ్గించి ఫిట్‌గా ఉండండి. పై టిప్స్ పాటించి చూడండి. తప్పకుండా హీరోల్లా ఉంటారు.

నిలువు గీతలు (స్ట్రిప్స్) ఉండే షర్ట్ లేదా టీషర్ట్ ధరించండి. పొడవుగా కనిపిస్తారు.

అడ్డగీతలు ఉండే షర్ట్స్ అస్సలు ధరించవద్దు. వాటి వల్ల మరింత లావుగా కనిపిస్తారు.

Images Credit: Pexels