లంగ్స్ సమస్యలతో బాధపడుతున్నారా? చలికాలంలో కాస్త జాగ్రత్త! శీతాకాలంలో శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఉబ్బసం, జలుబు, దగ్గు, న్యుమోనియా సహా పలు సమస్యలు తలెత్తుతాయి. లంగ్స్ సమస్య ఉన్న వాళ్లు చలికాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చలికాలంలో లంగ్స్ ఆరోగ్యంగా ఉండేందుకు ఫ్లూ, న్యుమోనియా వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిది. పొగమంచు, వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడం మరిచిపోవద్దు. ఆస్తమా రోగులు ఇన్ హేలర్ ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఊపిరితిత్తులకు మేలు కలిగించే పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి. చలికాలంలో స్మోకింగ్ మానుకోవాలి. లేదంటే గొంతు, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగిపోతాయి. All Photos Credit: Pixabay.com