‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ముగిసింది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్-6కు సన్నహాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున ఊహించని ఆఫర్ ప్రకటించారు. ‘స్టార్ మా’లో మొదలయ్యే ‘బిగ్ బాస్’ సీజన్-6లో సామ్యానులకు కూడా అవకాశం ఇస్తామన్నారు. ఇది కేవలం ‘వన్ టైమ్ గోల్డెన్ ఆపర్చునిటీ’ అని నాగ్ ప్రకటించారు. ‘బిగ్ బాస్’ సీజన్-2లో నూతన్ నాయుడు, గణేష్, సంజన అన్నె సామాన్యులుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గణేష్ సుమారు 83 రోజులు హౌస్‌లో సెలబ్రిటీలతో కలిసి ఉండగలిగాడు. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. నూతన్ 54వ రోజు బయటకు వెళ్లి, 75 రోజు మళ్లీ ఎంట్రీ ఇచ్చి, 84వ రోజు ఎలిమినేట్ అయ్యాడు. సంజన మొదటి వారంలోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ‘బిగ్ బాస్’ సీజన్ 2కు హీరో నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన మిగతా మూడు సీజన్లలో సామాన్యులకు అవకాశం చిక్కలేదు. మరి, మీరు కూడా సెలబ్రిటీ కావాలని అనుకుంటే.. నాగ్ చెప్పినట్లు చేయండి. Images Credit: Star Maa and Disney Plus Hotstar