సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఏకైక యాంకర్.. లాస్య! భర్త మంజునాథ్‌ను కూడా సెలబ్రిటీ చేసేసి.. తనలా మార్చేసుకుంది లాస్య. భర్త, ఫ్రెండ్స్‌తో రీల్స్, షార్ట్స్ వీడియోస్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను నవ్విస్తూ సందడి చేస్తోంది లాస్య. తాజాగా లాస్య తన తల్లిదండ్రులను కలిసింది. తన ఊరిలోని మామిడి తోటల్లో తిరుగుతూ అల్లరి చేసింది. చివరికి మామిడి చెట్టు కూడా ఎక్కేసింది లాస్య. మామిడి కాయలను చూస్తూ లాస్య తెగ మురిసిపోయింది. దీంతో అభిమానులు ఏమైనా విశేషమా లాస్య అని అడుగుతున్నారు. మరి, ఆమె ఫాలోవర్లు అడిగిన ప్రశ్న లాస్యకు అర్థమైందో లేదో! Images and Videos Credit: Lasya Manjunath/Instagram