నెట్‌ఫ్లిక్స్ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 మొదటి భాగం రేపటి (మే 27) నుంచి స్ట్రీమ్ కానుంది.

ఈ నాలుగో సీజన్‌లో మొత్తంగా తొమ్మిది ఎపిసోడ్లు ఉండనున్నాయి.

మొదటి భాగంలో ఏడు ఎపిసోడ్లు విడుదల చేయనున్నారు.

రెండో భాగంలో ఆఖరి రెండు ఎపిసోడ్లు ఉండనున్నాయి. జులై 1వ తేదీ నుంచి ఇవి స్ట్రీమ్ కానున్నాయి.

నాలుగో సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ.233 కోట్లు) ఖర్చు పెట్టినట్లు సమాచారం.

ఎక్కువ మంది చూసిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ల్లో స్ట్రేంజర్ థింగ్స్ మూడో సీజన్ మూడో స్థానంలో నిలిచింది.

విడుదలైన 28 రోజుల్లోనే 58.2 కోట్ల నిమిషాల పాటు స్ట్రేంజర్ థింగ్స్ మూడో సీజన్‌ను వీక్షించారు.

ఐదో సీజన్‌తో ఈ సిరీస్‌కు ముగింపు పలకనున్నారు.

ఈ సిరీస్ స్టోరీ 1980 దశకంలో సాగుతుంది. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో థ్రిల్లింగ్‌గా దీన్ని తెరకెక్కించారు.

మీరు ఒక మంచి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ మంచి ఆప్షన్.