ఒకవేళ మీరు వేగవంతమైన ట్రాన్స్‌పోర్ట్ గురించి మాట్లాడాలంటే విమానాలు అనే చెప్పవచ్చు. దీని ద్వారా ఎంత దూరం అయినా గంటల్లో వెళ్లిపోవచ్చు. అందుకే టైమ్ సేవ్ చేయాలనుకునేవారు విమానాల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. విమానాల్లో ప్రయాణం చాలా సులభంగా కూడా ఉంటుంది. మనదేశంలో కూడా ఎన్నో విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఎయిర్‌పోర్టులు పెద్దగానూ, కొన్ని ఎయిర్‌పోర్టులు చిన్నగానూ ఉంటాయి. మరి మనదేశంలో ఏది చిన్న ఎయిర్‌పోర్టు అన్న సంగతి మీకు తెలుసా? మనదేశంలో బాల్జాక్ ఎయిర్‌పోర్టు అత్యంత చిన్నది. దీన్ని టురా ఎయిర్‌పోర్టు అని కూడా అంటారు. మేఘాలయ రాష్ట్రానికి 33 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్‌పోర్టు ఉంది.