ప్రతి ఇంటి కిచెన్ లో కనిపించేది నాన్ స్టిక్ పాన్స్. కూరలు అడుగు అంటకుండా, మాడిపోకుండా చక్కగా ఉడుకుతాయి.



వీటిలో నూనె కూడ తక్కువ పడుతుందని ఎక్కువ మంది గృహిణులు వీటిని వినియోగిస్తారు.



అందుకే గీతలు పడి పాడైపోయినా వాటి మీద వంట చేస్తూ ఉంటారు కొందరు.



కానీ అవి క్యాన్సర్ కు ప్రమాదకారిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



గీతలు పడిన పాన్ మీద మిలియన్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్ ఉంటాయని అవి ఆహారంలోకి సులభంగా చేరిపోతాయి.



మైక్రోప్లాస్టిక్ అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి ఐదు మిల్లీ మీటర్ల కంటే చిన్నగా ఉంటాయి.
కంటికి కనిపించవు.


మైక్రోప్లాస్టిక్ లు ఎండోక్రైన్ డిస్ రఫ్ట్, హార్మోన్ అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యల్ని కలిగిస్తాయి.



వంట కోసం ఎప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ పాన్ లు ఉపయోగించడం ఉత్తమం.



ఇవి ఆహారంలోని పోషకాలని నిలుపుతాయి.



అందుకే సిరామిక్ పాన్ లో వంట చేయడం మానుకోవాలి.
Images Credit: Pexels