తన కోపమే తన శత్రువు తన శాంతమె తనకు రక్ష అంటారు. అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే చెప్పినంత తేలికేం కాదు. ఆ క్షణం ఏం జరిగినా విచక్షణతో ఆలోచించి ఆగ్రహాన్ని అణుచుకోవాల్సి ఉంటుంది.
ఆ ఒక్క క్షణం కంట్రోల్ అయితే చాలు... ఆ తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుంది.
కొన్ని రాశుల వారు మాత్రం మ్యాగ్జిమం కూల్ గా ఉండేందుకు ప్రయత్నించడమే కాదు...తన చుట్టుపక్కల ఉన్నవారిని కూడా కూల్ గా ఉంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారట.
మిథునం ఈ రాశి వారు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారు ఎంత కోపంగా ఉన్నప్పటికీ కూల్ చేయగల సామర్థ్యం వీరి సొంతం. ఎంత తగ్గిఉందామనుకున్నా పరిస్థితులు పీక్స్ కి వెళ్లినప్పుడు మాత్రం అగ్నిగోళంలా మండుతారట.
కర్కాటకం ఈ రాశి వారి అధిపతి చంద్రుడు కావడంతో వీళ్లు కూడా వెన్నెలలా ప్రశాంతంగా ఉంటారని చెబుతారు జ్యోతిష్య పండితులు. వీరికి కూడా కోపం రాదని చెప్పలేం కానీ చాలా తక్కువ సార్లు కోప్పడతారట.
కన్య కన్య రాశివారు కోపంలో ఉన్నా, నార్మల్ గా ఉన్నా తమ సహజ స్వభావానికి విరుద్ధంగా అస్సలు ప్రవర్తించరు. వీళ్లకి కూడా కోపం రాదు అని కాదు కానీ ఎండుగడ్డి మంటలా కోపం వచ్చి భగ్గున మండి వెంటనే కూల్ అయిపోయి...ఎదుటి వారిని కూడా నార్మల్ చేసేస్తారట.
కుంభం కుంభ రాశివారది నిండు కుండలాంటి వ్యక్తిత్వం. తమ జీవితాన్ని ఓ దారిలో పెట్టుకోవడమే కాదు తమతో ఉన్నవారికి కూడా సహాయ పడే మనస్తత్వం వీరిది. వీళ్లు కోప్పడినా అది కేవలం ఎదుటి వారి మంచిదే అని గుర్తించాలంటారు జ్యోతిష్యులు. ఊరికే ఊరికే కోప్పడని వ్యక్తుల్లో కుంభరాశివారు కూడా ఉంటారు.
మీనం మీన రాశి వారిది చాలా ప్రశాంత స్వభావం. వీళ్లను చూసి ముందు బ్యాడ్ పర్సన్స్ అనిపించినా క్లోజ్ గా ఉండి అబ్జర్వ్ చేస్తే అద్భుతం అనిపిస్తారట. మీన రాశివారు కూడా తమ మనస్సాక్షికి వ్యతిరేకంగా అస్సలు ప్రవర్తించరు..కొన్ని సందర్భాల్లో తాము బాధపడినా ఎదుటివారిపై మాత్రం కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటారట.