కరోనా వ్యాక్సిన్ వేశాక పిల్లలకు పారాసిటమాల్ ఇవ్వద్దు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు కేంద్రం అనుమతి వచ్చాక చాలా పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. పెద్దల్లాగే పిల్లల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాక కొన్ని సైడ్ ఎఫెక్టులు కనిపిస్తాయి. జ్వరం, వ్యాక్సిన్ వేసిన చోట కాస్త నొప్పి ఉంటుంది. రెండూ మూడు రోజులకు ఇవి పోతాయి. కొందరి పిల్లల్లో మాత్రం అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు కూడా కనిపిస్తాయి. వ్యాక్సిన్ వేసిన రెండు రోజుల తరువాత జ్వరం తగ్గకుండా పిల్లల్లో ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇంజెక్షన్ చేసిన చోట పిల్లలకు ఐస్ ప్యాక్ తో రుద్దుతూ ఉండాలి. దీని వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది. కోవాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ వారు వ్యాక్సిన్ వేశాక పిల్లలకు జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వొద్దని ప్రత్యేకంగా చెప్పారు. నీళ్లు అధికంగా తాగించాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాదు, శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి. వ్యాక్సిన్ వేశాక పిల్లలను దాదాపు ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూడాలి.