అరిటాకులో తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో అరిటాకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. వేడి అన్నం, కూరలు వడ్డించగానే ఆకులోని పోషకాలు కూడా వీటిలో కలుస్తాయి. అవి రుచిని పెంచడమే కాదు, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అరిటాకులో తినేవారికి ఆకలి పెరుగుతుందని కూడా చెబుతారు. పర్యావరణానికి కూడా ఈ ఆకులు చాలా మంచివి. భూమిలో ఇట్టే కలిసిపోయి ఎరువుగా మారిపోతాయి. మరిన్ని మొక్కలు పెరిగేందుకు సహకరిస్తాయి. అరిటాకులో తరచూ భోజనం చేసేవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. చైనాలో చేసిన ఒక పరిశోధన పార్కిన్ సన్స్ వ్యాధిగ్రస్తులు అరిటాకులో భోజనం చేస్తే చాలా మేలని తేల్చింది. క్యాన్సర్ నివారణ గుణాలు కూడా ఈ ఆకులో ఉన్నాయని చెబుతారు.