ఆరోగ్యవంతమైన ఆహారం అన్ని రకాలుగా మేలు చేస్తుంది. మెదడు చురుకుగా ఉండేందుకు కొన్ని రకాలా ఆహారాలు తప్పక తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు ప్రత్యేకంగా మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. అవేమిటో తెలుసుకుందాం. బాదం - వాల్నట్ బాదాములు, వాల్నట్స్ వంటి గింజల్లో హెల్తీ ఫ్యాటీ ఆసిడ్లు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. బ్లూబెర్రి బ్లూబెర్రీస్ లో ఆంథోసియానిన్స్ ఎక్కువ. ఇవి జ్ఞాపకశక్తి పెంపొందిస్తాయి. మెదడును చురుకుగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లలో మెదడు ఆరోగ్యానికి అవసరమయ్యే ఫ్లవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడుకు రక్తప్రపరణ పెంచుతాయి. గుడ్డు గుడ్డులో ఉండే కొలైన్ మెదడు పనితీరు మెరుగు పరిచే పోషకం. గుడ్డుతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పసుపు పసుపులో ఉండే కర్క్యూమిన్ కి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటుంది. ఫలితంగా మెదడు పని తీరు మెరుగుపరుస్తుంది కూడా . Images courtesy : Pexels