చేప నూనె ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్ అత్యధికంగా కలిగిన ఆహారం. ఇది గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. చేప నూనె నుంచి లభించే ఒమెగా3 చాలా ఆరోగ్యకరం. చేపలు తినని వారు సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటే మంచిది. చేపనూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ తక్కువ. ట్రైగ్లిజరైడ్స్ తక్కువ. బీపి అదుపులో ఉంచుతుంది. డిప్రెషన్ వంటి పరిస్థితికి కొన్ని సార్లు ఒమెగా3 తక్కువగా ఉండడం కారణమవుతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నవారికి ఫిష్ ఆయిల్ చాలా ప్రయోజనకరం. చేప నూనె కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కళ్లు పొడిబారకుండా నివారిస్తుంది. చేప నూనె శ్వాస వ్యవస్థలోని ఇన్ప్లమేషన్ తగ్గించి శ్వాసలో ఏర్పడే ఇబ్బందిని నివారిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డి అవసరం. ఒమెగా 3 తో బోన్ మినరల్ డెన్సిటి పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు నెమ్మదించడాన్ని ఫిష్ ఆయిల్ నివారిస్తుంది. ఒమెగా3 సప్లింమెంట్లు వాడినపుడు మెదడులో జరిగే మార్పులు నెమ్మదించినట్టు గమనించారు. ఆస్తమా వంటి అలర్జీలు ఉన్న వారు తప్పక చేపలు తినాలి. Images courtesy : Pexels