టీ,కాఫీలతో తినకూడని ఆహారాలు ఇవే టీ లేదా కాఫీ తాగుతూ చాలామందికి స్నాక్స్ తినే అలవాటు ఉంది. అయితే కొన్ని రకాల స్నాక్స్ తినకూడదు. టీతో పాటూ పకోడీలు, భుజియా వంటివి తినకూడదు. అవి శెనగపిండితో చేస్తారు. శెనగపిండితో చేసే చిరుతిళ్లు, జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. పోషకాలను గ్రహించడంలో శరీర సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. టీ తాగుతూ చల్లటి ఆహారాలు తినకూడదు. ఈ కలయిక జీర్ణ వ్యవస్థను బలహీన పరుస్తుంది. టీ తాగుతూ పసుపు కలిపిన ఏ పదార్థాలు తినకపోవడమే మంచిది. లేకుంటే పొట్టలో గ్యాస్, మలబద్ధకంవంటివి వస్తాయి. లెమన్ టీ అధికంగా తాగడం మంచిది కాదు. ఇది అసిడిక్ రియాక్షన్ చూపిస్తుంది. టీలో టానిన్లు, ఆక్సలైట్లు ఉంటాయి. ఇవి ఇరుమును శరీరం శోషించకుండా అడ్డుపడతాయి. కాబట్టి టీ తాగుతున్నప్పుడు ఇనుము అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.