ఆలుగడ్డలతో స్వీట్ హల్వా

బంగాళాదుంపలు - రెండు
పంచదార - నాలుగు స్పూన్లు
ఎండు ద్రాక్ష - ఒకటి
బాదం పప్పులు - నాలుగు
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
పాలు - పావు కప్పు
జీడిపప్పులు - ఐదారు
యాలకుల పొడి - పావు టీస్పూను

బంగాళాదుంపలు ఉడకబెట్టి తొక్క తీసి, మెత్తని పేస్టులా చేసుకోవాలి.

కళాయిలో నెయ్యి వేసి వేడి అయ్యాక బంగాళాదుంపల పేస్టును వేసి రెండు, మూడు నిమిషాలు ఉడికించాలి.

అందులో పాలు, పంచదార వేసి బాగా కలపాలి. మాడిపోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి.

యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి.

నెయ్యిలో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఉడుకుతున్న హల్వాలో ఈ వేయ్యించిన నట్స్ ను చల్లుకోవాలి.