సొరకాయ ముక్కలు - ఒక కప్పు పెసర పప్పు - ఒక కప్పు బియ్యప్పిండి - ఒక టీ స్పూను కొత్తి మీర - ఒక కట్ట అల్లం ముక్క - చిన్నది పచ్చి మిర్చి - రెండు ఉప్పు - రుచికి సరిపడా నూనె - తగినంత
పొట్టు తీసిన పెసరపప్పు నాలుగు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
నానిన తరువాత మిక్సీజార్లో పెసర్లు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు సొరకాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేయాలి.
పెసర్లతో కలిపి రుబ్బుకోవాలి. ఆ పిండిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
ఆ పిండిలో సన్నగా తరిగిన కొత్తిమీర, బియ్యప్పిండి, తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి.
దోశెలు పోసుకోవడానికి వీలుగా వచ్చేలా అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు.
పెనం వేడెక్కాక ఆయిల్ వేసి దోశెల్లా పోసుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.