రోజుకో చిటికెడు మిరియాల పొడి తింటే చాలు మిరియాలు లేదా మిరియాల పొడిని రోజువారీ ఆహారంలో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇండియన్, మెక్సికన్, ఇటాలియన్, కాంటినెంటల్ వంటల్లో దీన్ని వాడతారు. మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడతాయి. మిరియాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. పేగుల్లో మంచి బ్యాక్టిరియా చాలా అవసరం. వాటిని పెంచడంలో మిరియాలు సహాయపడతాయి. మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మూడ్ స్వింగ్స్ రాకుండా అడ్డుకుంటాయి. శరీర నొప్పుల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి మిరియాలు. నల్ల మిరియాలు శరీరం పోషకాలు గ్రహించేలా ఉంటుంది. ముఖ్యంగా సెలీనియం, కాల్షియం వంటివి గ్రహించేలా చేస్తుంది.